Sunday, June 5, 2011

అలుపెరగని సుదీర్ఘ బాటసారి.. మూవీమెఘల్

ఆయన చదివింది సినిమా. ఆయనకు తెలిసింది సినిమా. అందుకే ఆయన మూవీ మొగల్‌ అయ్యారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. నటరత్న ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి ఇప్పటి అల్లరి నరేశ్‌ వరకు ఎంతోమందితో సినిమాలు నిర్మించారు. మరెంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్‌ డి. రామానాయుడు. ఇలా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెడుతున్నారు.

మూవీమెఘల్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని వ్యక్తి డాక్టర్‌ డి. రామానాయుడు. సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని కోరికతో స్వయంగా సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు రామనాయుడు. తొలుత కో-ప్రోడ్యూసర్గా మరోకరితో కలిసి అనురాగం అనే సినిమాను నిర్మించారు. ఇక తరువాత సొంత నిర్మాణం సురేశ్ప్రొడక్షన్స్సంస్థను స్థాపించి తొలి చిత్రమే ఎన్టీఆర్హీరోగా తీశారు. రాముడు-భీముడుగా ఎన్టీఆర్ను డ్యూయల్రోల్లో చూపించి ఫస్ట్మూవీతోనే సూపర్సక్సెస్ను సాధించారు. అయితే ఆ ఫస్ట్‌ హిట్‌ మూవీని రీమేక్‌ చేయాలన్న కోరికతో ఉన్నారు రామానాయుడు.

రాముడు భీముడు భారీ హిట్తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు రామానాయుడు. ఎన్టీఆర్తో అయన తీసిన మరో చిత్రం శ్రీకృష్ణ తులాభారం. పౌరణికం ప్రేక్షకులను బాగా అలరించింది.

పట్టుదలనే అస్త్రంగా చేసుకుని మరికొన్ని సినిమాలకు శ్రీకారం చుట్టారు రామానాయుడు. సమయం కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్అయ్యాయి. అప్పుడు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ఆయనకు నైతిక మద్దతునిచ్చారు. డూ ర్‌ డై పొజిషన్‌లో రామానాయుడు తీసిన చిత్రం "ప్రేమనగర్". అక్కినేని నాగేశ్వరరావు నటించిన మూవీ రామానాయుడికి ఎంతో కీర్తి ప్రతిష్టల్నీ సంపాదించి పెట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక మైలురాయిలా నిలిచిపోయింది.

తర్వాత రామానాయుడి ఖాతాలో చేరిన మరో బ్లాక్బస్టర్మూవీ దేవత. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్బాబు, మోహన్బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇప్పటి వరకు రామానాయుడు నిర్మించిన సినిమాల సంఖ్య నూట పాతిక. ఇందులో 75 తెలుగు సినిమాలు, 19 హిందీ సినిమాలు, 24 తమిళ చిత్రాలు, బెంగాలీలో రెండు సినిమాలు, రెండు కన్నడ చిత్రాలు, ఓరియా, అస్సామి భాష చిత్రాలు కూడా ఉన్నాయి.

నిర్మాత సక్సెసయిన రామానాయుడు తన వారసులను వెండితెరకు పరిచయం చేశారు. తనయుడు సురేష్‌బాబు నిర్మాతగా, హీరోగా వెంకటేష్‌, రీసెంట్‌గా మనవడు రానా.. తమ తమ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

తన వారసులనే కాదు ఎంతోమందిని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసిన క్రెడిట్‌ కూడా రామానాయుడిదే. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, 21 మంది దర్శకులను, 7 గురు మ్యూజిక్ కంపోజర్లు... మరెంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులను సినీ రంగానికి తీసుకొచ్చిన ఘనత రామానాయుడుది. అంతేకాదు. పాతికేళ్ళుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల సాగరంలో ముంచేస్తున్న బ్రహ్మనందాన్ని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసింది కూడా ఆయనే.

ఇక సినిమాలను ఏదో ఊరికే తీయడం అంటే ఆయనకు నచ్చదు. దర్శకులకు పూర్తి స్వేచ్చనిచ్చే ఆయన... నిర్మాతగా అనేక సూచనలిస్తారు. తన అభిరుచులను సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన్ను విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టింది. సినిమా పట్ల ఆయన తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధే సినిమా విజయానికి కారణమని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు.


సినిమాలే తన ప్రపంచంగా మార్చుకున్న ఆయన ఈ రంగంలో అనేక రికార్డులు సాధించారు. అందులో చెప్పుకోవాల్సింది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సాధించిన ఈ ఘనతలో రామానాయుడు ఒకరు. దేశంలో సినీప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సాధించిన ఘనత కూడా మూవీ మెగల్‌ది.

ఇక వ్యక్తి గతంగానూ ఆయన చేసిన సేవలకు అనేక గౌరవాలు దక్కాయి. ఇక సినీ రంగానికే కాదు తన ఎదుగుదలకు తొడ్పడ్డ ప్రేక్షకులకు, ప్రజలకు కూడా సేవ చేస్తున్న వ్యక్తి రామానాయుడు. రాజకీయాల్లో వచ్చి సేవ చేయడంతో పాటు ట్రస్ట్‌ ద్వారా తన సొంత డబ్బులో అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారాయన.

రామానాయుడు నాలుగు దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమను చూస్తున్నారు. తనదైన స్టైల్లో సినిమాలను చూపిస్తున్నారు. అగ్రతారలందరితో సినిమాలు తీసిన ఆయన వారి స్టార్‌ డమ్‌ను మరింతగా పెంచారు.

ఓ రాముడు భీముడు, ఓ ప్రేమ్‌నగర్‌, ఓ సొగ్గాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు... ఇవన్నీ ఆయన సారధ్యంలోనే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దలుగా సినీ వినీలాకాశంలో హీరోలకు, దర్శకులకు ధీటుగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న వ్యక్తి ఒక్క రామానాయుడు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అయన అలుపెరగని సుదీర్ఘ బాటసారి.. ఎవ్వరు సాధించలేని ప్రపంచరికార్డులు ఒంటి చేత్తో సాధించగల నేర్పరి.. హిట్‌ సాధించేంతవరకు నిద్దురపోని గడుసరి.. ఆ మూవీమెఘల్‌కు బర్త్‌ విషెస్‌ అందిద్దాం.

-స్వామి ముద్దం


Tuesday, November 30, 2010

అన్నమయ్య

అన్నమయ్య

అచ్చ తెలుగుదనాన్ని తేనెలో ముంచి తీసినంత తియ్యగా..

హృదయానికి అతి దగ్గరగా దూసుకుపోయే పదాలు ఆయన పాటల్లో ఉంటాయి. ఆయన కీర్తనల్లో భక్తి ఉంటుంది.. రక్తి ఉంటుంది.. తత్వం ఉంటుంది.. తన్మయత్వం ఉంటుంది. ఆయనే తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈనాటి తెలుగు వెండితెరకు కూడా ఆయన పరోక్షంగా పాటలు అందించాడు. శతాబ్దాలుగా తన పాటలతో తెలుగు వారిని అలరిస్తున్నాడు ఈ తొలి తెలుగు వాగ్గేయకారుడు. అన్నమయ్య జయంతి సందర్భంగా ఆయన గీతాలను ఓసారి ఆస్వాదిద్దామా..


చందమామ రావే జాబిల్లి రావే అంటే తిరుమలేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ పిల్లలు మాత్రం హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి ఆరువందల ఏళ్ళు దాటుతున్నా తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయాయి.

తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తం ముప్పై రెండు వేల పాటలు రాసాడు.

అన్నమయ్య 1408 మే 9న కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో జన్మించాడు. తెలుగు సాహితీ చరిత్రలో ఆయనను మొదటి వాగ్గేయకారుడు చెప్పుకుంటారు.

8 వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడట. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోతుండగా, అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని చెప్పిందట. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రాశాడు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రాశాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

తెలుగులో నాగార్జున నటించిన అన్నమయ్య సినిమా భారీ సక్సెస్‌‌ సాధించింది. అందులోని పాటలు ప్రేక్షక హృదయాలకు తాకాయి.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య 1503 ఫిబ్రవరి 23న పరమపదించాడు. రాగిరేకులమీద రాసిన తిథుల కారణంగా అన్నమయ్య జన్మ, మరణ రోజులు వెలుగులోకి వచ్చాయి.

అన్నమయ్య రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా ఉండడంతో తరాలుగా ఆ పాటలు ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.

ఒంటరి..



తొలిసంధ్య వేళల్లో
చిగురాకు కౌగిట్లో
నిద్రిస్తొంది ఓ నీటి బొట్టు
ఆ జంట చూడముచ్చటగా
అపర ప్రేమికుల్లా ఉన్నాయి...

అప్పుడే పలుకరించింది ఓ పిల్లగాలి ఆ ఆకును
ఆ ఆకు.....
నీటిబొట్టు జాడ మరిచింది
ఆనందంతో నాట్యం చెసింది
పాపం..ఆ నీటిబొట్టు జారుతోంది జాలిగా ఆ ఆకు వైపు చూస్తూ!!!

పిల్లగాలి వెల్లిపొయింది..
ఆ ఆకు చూసింది నీటిబొట్టు వైపు
అప్పటికే అంతా అయిపొయింది.
ఆ నీటిబొట్టు జారిపొయింది..
నేలలో ఇంకిపొయింది...

ఆ ఆకుని చూసాన్నేను
అస్పష్టంగా పొరలు పొరలుగా
కనిపించింది ఒక రూపం
ఎక్కడో చూసినట్టుంది ఆ రూపం
అవును ప్రతిరోజు అద్దంలో
నెనే ఆ ఆకుని
తోడులేని ఒంటరిని!!!


ప్రేమ వర్షం




ఒక్క మనసులో
లక్షలాది భావాలు
కొట్లాది ఆలొచనలు
చుట్టుముడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి

ఇంతలో..

మనసు ఆకాశంలోని
భావాల మబ్బులను చిలికితే
ఆలోచనల చినుకుల సంగమం
కవితల వరదలా ప్రవహించింది

మనసులో బరువుని
చుక్కలు చుక్కలుగా కిందకి దించింది
ఆలోచనల చినుకులన్ని రాలిపోయాక
వాన కూడ ఆగిపొయింది

వాన ముద్దులలో తడిసి ముద్దయిన రాత్రి
తియ్యని పరవశంతో నిద్ర లేచింది
వెల్లిపొయిన వానకు జ్ణాపకంగా
నా హృదయ పత్రం పై మిగిలాయి రెండు నీటి బొట్లు

అవి నీటి బొట్లా
కాదు కాదు ప్రేమాక్షరాలు!
ఇన్నాళ్ళుగా ఆలోచనల పొరల
మధ్యలో ఉపిరాడని నా ప్రేమ
మనసు కరిగితే కాని బయటపడలేదు!

Saturday, November 1, 2008