Tuesday, November 30, 2010

ఒంటరి..



తొలిసంధ్య వేళల్లో
చిగురాకు కౌగిట్లో
నిద్రిస్తొంది ఓ నీటి బొట్టు
ఆ జంట చూడముచ్చటగా
అపర ప్రేమికుల్లా ఉన్నాయి...

అప్పుడే పలుకరించింది ఓ పిల్లగాలి ఆ ఆకును
ఆ ఆకు.....
నీటిబొట్టు జాడ మరిచింది
ఆనందంతో నాట్యం చెసింది
పాపం..ఆ నీటిబొట్టు జారుతోంది జాలిగా ఆ ఆకు వైపు చూస్తూ!!!

పిల్లగాలి వెల్లిపొయింది..
ఆ ఆకు చూసింది నీటిబొట్టు వైపు
అప్పటికే అంతా అయిపొయింది.
ఆ నీటిబొట్టు జారిపొయింది..
నేలలో ఇంకిపొయింది...

ఆ ఆకుని చూసాన్నేను
అస్పష్టంగా పొరలు పొరలుగా
కనిపించింది ఒక రూపం
ఎక్కడో చూసినట్టుంది ఆ రూపం
అవును ప్రతిరోజు అద్దంలో
నెనే ఆ ఆకుని
తోడులేని ఒంటరిని!!!


ప్రేమ వర్షం




ఒక్క మనసులో
లక్షలాది భావాలు
కొట్లాది ఆలొచనలు
చుట్టుముడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి

ఇంతలో..

మనసు ఆకాశంలోని
భావాల మబ్బులను చిలికితే
ఆలోచనల చినుకుల సంగమం
కవితల వరదలా ప్రవహించింది

మనసులో బరువుని
చుక్కలు చుక్కలుగా కిందకి దించింది
ఆలోచనల చినుకులన్ని రాలిపోయాక
వాన కూడ ఆగిపొయింది

వాన ముద్దులలో తడిసి ముద్దయిన రాత్రి
తియ్యని పరవశంతో నిద్ర లేచింది
వెల్లిపొయిన వానకు జ్ణాపకంగా
నా హృదయ పత్రం పై మిగిలాయి రెండు నీటి బొట్లు

అవి నీటి బొట్లా
కాదు కాదు ప్రేమాక్షరాలు!
ఇన్నాళ్ళుగా ఆలోచనల పొరల
మధ్యలో ఉపిరాడని నా ప్రేమ
మనసు కరిగితే కాని బయటపడలేదు!

No comments: